ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకులు లారెన్స్ అంటే ఒప్పుడు డ్యాన్స్ సినిమాలు గుర్తుకు వచ్చేవి..కానీ ‘ముని’సినిమా ఎప్పుడైతే తీశాడు..అప్పటి నుంచి లారెన్స్ అంటే హర్రర్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.  ఒకప్పుడు హర్రర్ సినిమాలంటే భయంతో చూసేవారు..కానీ ఇప్పుడు చిన్న పిల్లలు సైతం ఇలాంటి సినిమాలు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  హర్రర్ జోనర్ లో ఇలాంటి సినిమాలు ప్రత్యేకంగా నడుస్తున్నాయి.  ముని సినిమా తర్వాత ఎన్నో హర్రర్ సినిమాలు ఈ తరహా కామెడీ కాన్సెప్ట్ తోనే వచ్చాయి.


గంగ సినిమా తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని ‘కాంచన3’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లారెన్స్.  తెలుగు, తమిళ భాషల్లో 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 4 వారాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. సాధారణంగా తమిళ సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే కానీ తెలుగు లో డబ్బింగ్ చేస్తే యావరేజ్ గా నడుస్తాయి.  కథ బాగుంటే ఎలాంటి సినిమాలైన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.  ఆ మద్య విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’బ్లాక్ బస్టర్ అందుకుంది.   

ఇక కాంచన 3 విషయానికి వస్తే.. తెలుగు లో ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా ఆదరించారు.  తెలుగులో ఈ సినిమాను 'ఠాగూర్' మధు విడుదల చేశారు. వసూళ్ల పరంగా బి - సి సెంటర్స్ లో దుమ్మురేపేసిన ఈ సినిమా, అన్ని ఖర్చులుపోను ఆయనకి 10 కోట్ల లాభం తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. నెగిటివ్ టాక్ తో ఈ సినిమా ఈ స్థాయి లాభాలను తీసుకురావడం గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: