తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాఠలు రచించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు చంద్రబోస్.  ఆయన రాసిన పాటల ఇప్పటికీ టీవిల్లో, ప్రైవేట్ కార్యక్రమాల్లో మారుమోగుతుంటాయి. ప్రస్తుతం పలు టివి ఛానల్స్ లో జడ్జీగా వ్యవరిస్తున్నారు.   తాజాగా గేయ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది.   చంద్రబోస్ తల్లి మదనమ్మ కన్నుమూశారు. గుండె పోటుతో ఈ ఉదయం ఆమె చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


మదనమ్మ అంత్యక్రియలు స్వగ్రామం వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో సాయంత్రం జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  నరసయ్య, మదనమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ చిన్నవాడు. తన తల్లి ప్రోత్సాహం, ప్రేమాభిమానాల వల్లే నేనీ స్థాయిలో ఉన్నానని చంద్రబోస్ చాలా సందర్భాల్లో చెప్పేవాడు.


వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలో మదనమ్మ అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గేయ రచయితగా  అచిర కాలంలోనే చంద్రబోస్ తనదైన శైలితో తన ప్రత్యేకతని నిరూపించుకున్నాడు.   చంద్రబోస్ తల్లి మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: