ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అరవింద సమేత వీర రాఘవ.  రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన స్టోరీలు అన్ని నరుక్కోవడం, రక్తపాతంతో నిండిపోతే... అరవింద సమేత మాత్రం అందుకు భిన్నంగా మార్పును కోరుకుంటూ సినిమా చేశారు.  ఇందులోని సాంగ్స్ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి.  థమన్ అందించిన సంగీతం సినిమాకు  పెద్ద అసెట్ అయింది.  


ఓపెనింగ్ సీన్ లో భారీ ఫైట్ ను చూపించారు.  విదేశాల నుంచి చదువుకొని తిరిగి వచ్చే ఎన్టీఆర్ ను రివీల్ చేసే సీన్.  అదే సమయంలో రాయలసీమ గ్రామంలోని వ్యతిరేక వర్గం వారు దాడి చేసి ఎన్టీఆర్ తండ్రిని చంపేస్తారు.  ఆ సమయంలో ఎన్టీఆర్ చేసిన ఫైట్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది.  తండ్రి చంపిన వ్యక్తులను చంపుతూ... మొండి కత్తిని చేతికి కట్టుకొని నడిచి వచ్చే సీన్ సినిమాకు హైలైట్ అయ్యింది.  


దానికి సంబంధించిన ఫోటోను అభిమానుకు సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేశారు.  అరవింద సమేత సినిమా సమయంలో ఆ ఫోటోలు ఎక్కువగా సెర్చ్ అయ్యాయి.  చాలా కాలం తరువాత మరలా ఆ ఫోటో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.  ఎన్టీఆర్ పుట్టినరోజైన ఈరోజు అభిమానులు ఎన్టీఆర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  అరవింద సమేత సినిమాలోని ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో మొండికత్తి పట్టుకొని నడిచి వచ్చే సీన్ ఫోటోను కూడా షేర్ చేశారు.  ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: