సూపర్‌స్టార్ మహేష్‌బాబు మహర్షి సినిమా సమ్మర్లో కూడా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతోంది. మహర్షి దూకుడు ముందు పాత రికార్డులు అన్ని పగిలిపోతున్నాయి. మహేష్‌బాబు కెరీర్లోనే చాలా ఏరియాల్లో లాంగ్ రన్లో వచ్చిన వసూళ్లను సైతం మహర్షి ఇప్పటికే దాటేసింది.
మహేష్ ఎంచుకున్న సబ్జెక్ట్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడమే సినిమాలో మేజర్ హైలెట్ అయ్యింది. 4 రోజులకే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రూ.65 కోట్ల షేర్ రాబట్టిన మహర్షి 11 రోజులకే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 72.79 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు పోటీ సినిమాలు లేకపోవడం మహర్షి మరో వారం రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర దున్నేసుకోవచ్చు. ప్రస్తుతం మహర్షికి ఈ నెల 24న రిలీజ్ అవుతోన్న సీత మాత్రమే పోటీ కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో మహర్షి 11 రోజుల వసూళ్లు ( రూ.కోట్లలో ):
నైజాం - 25.4
సీడెడ్ - 9.06
గుంటూరు - 7.86
వైజాగ్ - 8.94
ఈస్ట్ - 7.92
వెస్ట్ - 5.51
కృష్ణా - 5.42
నెల్లూరు - 2.70
--------------------------------------
ఏపీ + తెలంగాణ = 72.79 కోట్లు
---------------------------------------