హౌస్‌ఫుల్.. ఈ సినిమా సీరీస్ లో ఇప్పటివరకు వచ్చిన 3 భాగాలు బాలీవుడ్‌లో సూపర్ హిట్టవడమే కాకుండా నిర్మాతకు భారీ కలెక్షన్లను తీసుకు వచ్చాయి. ఈ సినిమా సిరీస్‌లో నటించిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు పొందారు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఇప్పుడు నాలుగో భాగం అయిన
'హౌస్‌ఫుల్-4' ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లోనే కాదు అందరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకే చిత్ర బృందం ఒక లేటెస్ట్ అప్డేట్ ని ఇచ్చారు.


బాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ మూవీ ఫ్రాంచైజీలలో 'హౌస్ ఫుల్' సీరీస్ ఒకటి.  తాజాగా ఈ సీరీస్ లో భాగంగా 'హౌస్ ఫుల్ 4'  రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్.. కృతి సనన్.. రితీష్ దేశ్ ముఖ్.. బాబీ డియోల్..పూజా హెగ్డే.. రానా దగ్గుబాటి.. కృతి కర్బందా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా గురించి తాజాగా అక్షయ్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలో రితీష్ దేశ్ ముఖ్ .. కృతి సనన్.. అక్షయ్ కుమార్.. పూజా హెగ్డే.. బాబీ డియోల్.. కృతి కర్భందా ఉన్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తుండగా నడయాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని సాజిద్ నడయడ్ వాలా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని దీపావళి పండగ సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 25 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  'హౌస్ ఫుల్' సీరీస్ లో తెరకెక్కిన గత చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: