కొరియోగ్రాఫర్ రంగం నుంచి దర్శకులుగా మారిన వ్యక్తులు ఎందరో ఉన్నారు.  వాళ్లలో ఈ తరానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తులు ప్రభుదేవా, రాఘవ లారెన్స్.  ఈ ఇద్దరు కొరియోగ్రఫీ నుంచి నటులుగా ప్రమోట్ అయ్యి దర్శకులుగా మారారు.  ఇప్పుడు నటనపరంగా, దర్శకత్వం పరంగా, అటు కొరియోగ్రఫీ పరంగా ఈ ఇద్దరు చాలా బిజీ అయ్యారు.  వీరి బాటలో ఇప్పుడు మరో అగ్ర డ్యాన్స్ మాస్టర్ నడవబోతున్నారు.  


గబ్బర్ సింగ్ సినిమా గుర్తుంది కదా.  ఆ సినిమాలో దేఖో దేఖో గబ్బర్ సింగ్ అనే సాంగ్ ఉంది కదా.  ఆ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించింది గణేష్ మాస్టర్.  ఈ సాంగ్ తో గణేష్ మాస్టర్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు.  డ్యాన్స్ అంటే గణేష్ మాస్టర్ కు ప్రాణం.  సినిమా ఓ ఫ్యాషన్.  సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు ఎందరో స్టార్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు.  


కొత్త కొత్త స్టెప్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో గణేష్ మాస్టర్ ఎప్పుడు ముందు ఉంటారు.  ఇపుడు ఈ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే కొన్ని కథలు సిద్ధం చేసుకున్నారట.  ఎలాగో చాలా సంస్థలతో కలిసి పనిచేశాడు కాబట్టి నిర్మాతలతో మంచి పరిచయాలు ఉంటాయి.  సినిమా చేయాలంటే ఏ నిర్మాత కాదనడు.  హీరోలు సైతం హెల్ప్ చేస్తారు.  ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే... గణేష్ మాస్టర్ కూడా మెగాఫోన్ పట్టుకుంటాడు అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: