ట్యాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ ని లాక్ చేయడంలో డి.సురేష్ బాబు, దిల్ రాజు తర్వాతనే ఎవరైనా. పెళ్లి చూపులు` సినిమాతో సైలెంట్ హిట్ కొట్టాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా రిలీజ్ కి ప్రమోషన్స్‌కి హెల్ప్ చేసింది మాత్రం సురేష్ బాబు. దగ్గరుండి మరీ ప్రమోట్ చేయడమే గాక రిలీజ్ కి అన్నిరకాలుగా సాయం చేశారు. అందుకనే సురేష్ ప్రొడక్షన్స్ లో వరుసగా సినిమాలకు సంతకం చేశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అలా ఆ బ్యానర్ లోనే `ఈ నగరానికి ఏమైంది?` చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే `పెళ్లి చూపులు` కమర్షియల్ బ్లాక్ బస్టర్. జాతీయ అవార్డులు గెలుచుకుంది. కానీ `ఈ నగరానికి ఏమైంది?` అన్నిరకాలుగానూ  విఫలమైంది.   

 ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ నుండి వస్తున్న మరో చిన్న చిత్రం `ఫలక్ నుమా దాస్`. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ఈ సినిమాలో తరుణ్ పోలీస్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన టీజర్.. ట్రైలర్లకు అద్భుత స్పందన వచ్చింది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేస్తున్నారు.  ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ ఇంప్రెస్సివ్ గా మాట్లాడుతు సురేష్ ప్రొడక్షన్స్  పై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు, నిర్మాత డి.సురేష్ బాబు పైనా తన ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేశాడు.   


ఎందరో ఫిల్మ్ మేకర్స్ ని.. దర్శకుల్ని తీర్చిదిద్దిన గొప్ప సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.. ఎంతమందిని గొప్పవాళ్ళగా తీర్చిదిద్దారు. అందుకే సురేష్ బాబు గారు కింగ్ మేకర్. చాలా గర్వంగా ఉంది. చాలా మంది చెప్పేవాళ్లు .. సురేష్ ప్రొడక్షన్స్ కి వెళితే లాక్ అయిపోతావు అనేవాళ్లు. వాళ్లందరికీ చెబుతున్నా.. నేను లాకైపోతా.. ఇక్కడ సినిమానే జీవితం``అని అన్నాడు. ఇక్కడే అర్థమవుతోంది ఎవరిని ఎవరు వదలడం లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: