తమిళ నటుడు స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ ‘యుగానికొక్కడు’సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కార్తీ నటించిన సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి.   కొన్ని మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి.  ఆ మద్య నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఊపిరి సూపర్ హిట్ అయ్యింది.  ఖాకీ కూడా మంచి హిట్ అందుకున్నది.  ఆ తర్వాత నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. 

అయితే ఫ్లాప్ లు ఎదురైతే ఏ హీరో అయినా కాస్త టైమ్ తీసుకోనైనా మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తుంటారు..ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లరు.  కానీ తమిళ హీరోల్లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.  చినబాబు - దేవ్ సినిమాలు నిరాశ పరిచినా..  హీరో కార్తీ ఎన్ని ప్లాపులు ఎదురైనా ప్రయోగాల తోనే ముందుకు సాగుతానని అంటున్నాడు. దాదాపు తమిళ్ తెలుగులో ఒక రేంజ్ లో హిట్స్ అందుకునే కార్తీ ఇటీవల మాత్రం తెలుగులో దారుణంగా విఫలమవుతున్నాడు.  ఇప్పుడు ఖైదీ అనే మరొక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ని పూర్తిగా రాత్రుల్లోనే చిత్రీకరించారట. 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే అయ్యి ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకొని ఎలాంటి ఇబ్బందులు పడుతాడో..మొత్తం చీకట్లో నే సాగుతుందట..లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమ్మర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: