టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీరే వేరు. అచ్చం నందమూరి తారకరామారావు గారి ముఖకవళికలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖంలో కనపడటంతో నందమూరి వంశ అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తాతకు తగ్గ మనవడిగా పోలుస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిపారు.


అయితే అనూహ్యంగా ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ నివాసం వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సమైన సందడి చేశారు. తారక్ నివాసం వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు సీఎం ఎన్టీఆర్ అంటూ కూడా కేకలు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కేకలు విన్న జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి అభిమానులను ఆప్యాయంగా పలకరించారు.


అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో చాలా మంది నెటిజన్లు ముఖ్యమంత్రి పీఠంపై ఎన్టీఆర్ కన్నేశాడు అంటూ కొంటెగా సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు నటిస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: