బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత అదే స్థాయిలో హిట్టు కొట్టాలని తన స్నేహితుడు సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. గత కొంత కాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యాక్షన్ నేపథ్యంలో బీభత్సమైన ఫైట్లతో తెరకెక్కించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన రెండు మేకింగ్ వీడియోస్ వదిలి సాహో సినిమా ప్రమోషన్ టైం స్టార్ట్ చేయడానికి డైరెక్టర్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


దీనితో సుజీత్ టీమ్ ఏకంగా ప్రభాస్ తోనే ఒక వీడియో చెయ్యించి మే 21న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అంటూ ప్రభాస్ తన ఇన్స్టా ద్వారా ఒక వీడియో పెట్టగా అది చూసిన డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. ఇక ఇప్పటి నుంచే మే 21 ఎలాంటి గిఫ్ట్ రాబోతోందా అని నిముషాలు లెక్కపెట్టుకుంటున్నారు.


అధిక శాతం అయితే టీజర్ కు సంబంధించి ఏదొక అప్డేట్ పోస్టర్ రూపంలో రావచ్చని అందరూ అనుకుంటున్నారు.కేవలం పోస్టర్ కోసమే అయితే ప్రభాస్ తోనే ఒక వీడియో చేయించాల్సిన అవసరం ఏముంది? ఆ పని నిర్మాణ సంస్థల వారే చూసుకుంటారు.అంటే దానిని మించిన ఏదో స్పెషల్ గిఫ్ట్ ఉంటుందనే అంచనాలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: