Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 9:03 pm IST

Menu &Sections

Search

ఆమె నా లక్కీ చార్మ్ అంటున్న తేజ

ఆమె నా లక్కీ చార్మ్ అంటున్న తేజ
ఆమె నా లక్కీ చార్మ్ అంటున్న తేజ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏప్పుడో వచ్చిన “చిత్రం” సినిమా నుండి రెండు సంవత్సరాల క్రితం వచ్చిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమా వరకు డైరెక్టర్ తేజ చాల విభిన్నమైన కధ, అద్బుతమైన దర్శకత్వం తో ప్రేక్షకుల ఆదరణ పొందారు. తేజ మార్క్ తన మొదటి చిత్రం “చిత్రం” నుండే కనిపించింది. ఇక “నువ్వు నేను” సినిమా అయితే అతనికి స్టార్ డైరెక్టర్ రేంజ్ ని తెచ్చిపెట్టినదనే చెప్పుకోవాలి. “ జయం “ సినిమా కూడా అదే రేంజ్ హిట్ కావడం తో తేజ ఇండస్ట్రీ లో మంచి స్థానాన్ని సంపాదించారు.

 

తేజ సినిమాలు చూసినట్లయితే ప్రతి రెండేళ్లకు ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తెసుకుని వచ్చేవారు. అయితే మహేష్ బాబు తో “నిజం” సినిమా ను 2003వ సంవత్సరం తీసిన తర్వాత తేజ 14 సంవత్సరాలు సైలెంట్ గా ఉండిపోయారు. నిజం చెప్పలంటే “నిజం “ ఒక విలక్షణమైన సినిమా. అద్బుతమైన దర్శకత్వం, కధ, మహేష్ ను ఒక విబిన్న నటుడిగా టాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా అది.

 

అప్పటి వరకు మహేష్ బాబు కేవలం ఫ్యామిలి డ్రామాలు లేక లవ్ స్టోరీలు చేయగలడు అన్న తరుణంలో తేజ , మహేష్ బాబు ను ఒక సరికొత్త పాత్రలో చూపించి అందరిని మెప్పించాడు. కాని ఈ సినిమా తేజా కి అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేకపోయింది. తరువాత “నేనే రాజు నేనే మంత్రి” సినిమా తో తేజ ఇస్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా “సీత” సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మన తేజ.

 

అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ గురించి మాట్లాడుతూ “తనతో నేను చేసిన సినిమాలు అన్ని హిట్ లే అదే విధంగా ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది”. అని అన్నారు. ఈ సినిమా ఈ నెల 24వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉంది.


సీత-సినిమా
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.