అరుంధతి అనగానే మనకు జేజేమ్మ జేజెమ్మ... అనే సాంగ్ గుర్తుకు వస్తుంది.  జేజెమ్మగా అనుష్క ఎలా నటించిందో చెప్పక్కర్లేదు.  ఒకరకంగా చెప్పాలి అంటే అనుష్క నటనతోనే సినిమా సూపర్ హిట్టైంది.  కోడి రామకృష్ణ ఈ సినిమాను మలిచిన తీరు అద్భుతం అని చెప్పాలి.  ఎన్నిసార్లు చూసినా మళ్ళా మళ్ళా చూడాలనిపించే సినిమా ఇది.  అనుష్కతో పాటు క్షుద్ర శక్తులను వశం చేసుకున్న పశుపతిగా సోనూసూద్ చేసిన నటన వర్ణణాతీతం.  ఈ రెండు పాత్రలే సినిమాకు కీలకం.  


అయితే, మొదట అరుంధతి సినిమా కోసం అనుష్కను ఛాయిస్ గా అనుకోలేదు.  మంచు లక్ష్మిని మొదట అరుంధతి పాత్ర కోసం ట్రై చేశారు.  ఆమె కోసం కోడిరామకృష్ణ, నిర్మాతలు చాలా ట్రై చేశారు.  మంచులక్ష్మీ అమెరికాలో ఉండటంతో ఆమె రావడం కుదరలేదు.  ఆ తరువాత మమతా మోహన్ దాస్ ను తీసుకోవాలని ట్రై చేశారు.  అప్పటికే మమతా క్యాన్సర్ తో బాధపడుతుండంతో ఆమెను పక్కన పెట్టారు.  


అప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్న అనుష్క దగ్గరికి ఆ పాత్ర వచ్చింది. అనుష్కను ఒట్టిగా సెలెక్ట్ చేయలేదు.  దానికోసం చాలా స్క్రీన్ టెస్ట్ చేశారు.  అరుంధతి పాత్రకోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్ లు వేసి స్క్రీన్ టెస్ట్ చేశారు.  అందరు బాగుంది అనుకున్న తరువాత సెట్స్ కు వెళ్లి మరలా డ్రెస్ తో టెస్ట్ చేయగా... అవి సరిగ్గా సరిపోకపోవడంతో కాస్ట్యూమ్స్ ను తిరిగి తయారు చేయించారు.  దాదాపు నాలుగు నెలలపాటు ఈ తతంగమంతా నడిచింది.  ఆ తరువాత ఫైనల్ గా అరుంధతి సెట్స్ మీదకు వెళ్ళింది.  


ఇలా సెట్స్ నుంచి థియేటర్లలోకి వచ్చిన తరువాత సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.  నిర్మాతలను నమ్మకాన్ని నిలబెట్టిన సినిమాగా నిలిచింది.  ఈ సినిమా తరువాత అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు.  ఇప్పటికి అలాంటి పాత్రలు చేయాలంటే అనుష్కకు మాత్రమే సాధ్యం అవుతుంది అనే విధంగా మారిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: