పవన్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.  ఈ సినిమాలో పవన్ తన మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రదర్శించి ఔరా అనిపించాడు.  ఆ తరువాత పవన్ హీరోగా, దర్శకుడిగా చేసిన జానీ సినిమాలో పవన్ మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా కనిపించి మెప్పించాడు.  అందుకే పవన్ సినిమాల్లో ఫైట్ సీన్స్ కంపోజింగ్ చాలా విచిత్రంగా ఉంటాయి.  మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అసలు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోవలసి వచ్చింది.  కారణం ఏంటి తెలుసుకుందాం.  


పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కాలేజీ రోజుల్లో కరాటే నేర్చుకునేవాడట.  పవన్ ను కూడా నేర్చుకోమంటే వినేవాడు కాదట.  నాకెందుకు అని పక్కనపెట్టేవాడట.  మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చూసినా పెద్దగా ఏమి అనిపించేది కాదని చెప్పాడు పవన్.  అయితే, కాలేజీకి వెళ్లే రోజుల్లో అన్న నటించిన మెగాస్టార్ సినిమాల గురించి చాలా మంది కామెంట్స్ చేసేవారు.  ఆ సమయంలో వాళ్ళను కొట్టాలని అనిపించినా... శారీరకంగా శక్తి లేక ఏమి అనలేకపోయేవాడు.  మద్రాస్ వెళ్లినా అక్కడ కూడా ఇదే విధంగా జరిగింది. 


దీంతో వాళ్ళను కొట్టాలనే కసితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు.  మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే సమయంలో పవన్ ఒపీనియన్ మారిపోయింది.  మార్షల్ ఆర్ట్స్ వలన ఎదుటి వాళ్ళను కొట్టడం కాదు తనను తాను ఎలా నియంత్రించుకోవచ్చో నేర్పుతుంది.  దానికి పవన్ బాగా ఇంప్రెస్ అయ్యాడు.  ఆ విధంగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకున్నాడు.  


అలా నేర్చుకున్న విద్యను పవన్ సినిమాల్లో ప్రదర్శించాడు.  బ్రూస్ లీ లా పూర్తి స్థాయిలో అలాంటి సినిమాలు చేయలేకపోయినా... తన పరిధిలో జానీ వంటి సినిమాలు అందించినట్టు పవన్ చెప్పాడు. ఏ విషయంపైనైనా నియంత్రణ కలిగే విధమైన మనస్తత్వం మార్షల్ ఆర్ట్స్ వలనే సాధ్యం అయ్యిందని పవన్ ఓ సందర్భంలో చెప్పాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: