ప్రేమ ఊపిరి పోస్తుంది. అదే ప్రేమ ఊపిరి తీస్తుంది.. మనిషి భావోద్వేగాల్లో అన్నింటి కన్నా తీవ్రమైంది ప్రేమే.. ఇందులో ఏ సందేహం లేదు.. ఈ ప్రేమ కోసమే ఎన్నో ఘర్షణలు, యుద్ధాలు, చరిత్రలో మలుపులు ఉన్న సంగతి తెలిసిందే. 


ఇప్పుడు ఓ అమ్మాయి ప్రేమ కోసం ఎన్ని హత్యలైనా చేస్తానంటున్నాడో కుర్రాడు. అతడే విజయ్ ఆంటోనీ.. ఇదీ త్వరలో ఆయన మనకు చూపించబోయే కిల్లర్‌ సినిమా స్టోరీ లైన్..ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సినిమాలో విజయ్‌ హంతకుడిగా కనిపించారు. అర్జున్‌ పోలీసు అధికారిగా కేసు విచారిస్తూ కనిపించారు. " అయితే.. అతను ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసమా..? అది కూడా వన్‌ సైడ్‌ లవ్‌.. అంటూ నాజర్‌ ప్రశ్నించారు. 

నువ్వు హత్య చేశావు.. అని అర్జున్‌ అంటే.. ఒక్క హత్యేంటి.. ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ అంటున్నాడు  విజయ్‌. జూన్‌ 5న జనం ముందుకు రానున్న ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. బిచ్చగాడు తర్వాత పెద్దగా హిట్ దొరకలేదు అతడికి. 


మరింత సమాచారం తెలుసుకోండి: