తెలుగులో కంటే తమిళంలోనే హార్రర్ కామెడీ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అంతేకాదు మిగతా జోనర్స్ లో లాగా ఈ జోనర్ లో తెరకెక్కుతున్న సినిమాలు మంచి కమర్షియల్ సక్సస్ ను సాధిస్తున్నాయి. అందుకే ఒక సినిమాతో ఆపకుండా చిన్న కామన్ పాయింట్ పట్టుకొని సీక్వెల్స్ మీద సీక్వెల్ తీసుకుంటూ వెళుతున్నారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులు ఈ తరహా సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే తమిళంలో తెరకెక్కుతున్న ఈ జోనర్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్ళను రాబడుతున్నాయి.


ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారిన తర్వాత 'ముని' అనే హార్రర్ కామెడీని తెరకెక్కించాడు ఆ సినిమా లారెన్స్ కి బాగా కలిసొచ్చింది. అంతే ఇక ఆ సినిమా కి సీక్వెల్స్ ని తీసుకుంటూ వెళుతున్నాడు. కాంచన, గంగ, శివలింగ, కాంచన-3 ఇలా సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళంలో ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ తో రూపొందించిన చాలా సినిమాలు బోల్తా పడాయి. కానీ ఈ సినిమాలు మాత్రం గ్యారెంటీ కమర్షియల్ హిట్ గా నిర్మాతలు జోబులు నింపుతున్నాయి.


ఇక ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ డాన్స్ మాస్టర్, డైరెక్టర్ ప్రభుదేవా కూడా అభినేత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి సక్సస్ ను అందుకున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా తెలుగు తమిళంలో బాగా సక్సస్ అయింది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ గా అభినేత్రి-2 ను తెరకెక్కించారు. మొదటిసారి కంటే రెట్టింపు భయపెట్టడానికి 'అభినేత్రి' సీక్వెల్‌ 'అభినేత్రి 2'తో రెడీ అయ్యారు. ప్రభుదేవా, తమన్నా జంటగా ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ 
'అభినేత్రి 2'. సోనూ సూద్, నందితా శ్వేత, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌ నిర్మించారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: