టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. మహేష్ సినిమా విడుదలవుతుందంటే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులు పగిలి పోవాల్సిందే. ఎప్పటికప్పుడు మహేష్ తనకంటూ రికార్డులు బాక్సాఫీస్ దగ్గర సెట్ చేసుకుంటాడు పాత రికార్డులను పగలు కొడుతుంటాడు. ప్రస్తుతం మహేష్ 25వ సినిమా మహర్షి బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన సంచలనాలు రికార్డులను సృష్టిస్తోంది.


దీంతో మహేష్ చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అది ఏ స్దాయిలో అంటే ఇంకా లాంచ్ కాని ఆయన తదుపరి సినిమా డిజిటల్ రైట్స్ అదిరిపోయే రేటుకు అమ్ముడుపోవటమే.ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిజిటిల్ ప్లాట్ ఫామ్ లో లీడింగ్ గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందించబోయే చిత్రం డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది.


సాధారణంగా ఏ చిత్రం అయినా షూటింగ్ ప్రారంభం అయ్యాక బిజినెస్ ప్రారంభం అవుతుంది. కానీ ఎఫ్ 2 వంటి క్రేజీ హిట్ ఇవ్వటం, మహేష్ బాబు బ్రాండ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. త్వరలో మొదలు కాబోతున్న ఈ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికల్లా ముగించుకొని సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు సినిమా యూనిట్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మహేష్ నటిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: