తమన్నా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు అయ్యింది. ఇప్పటికి చాలాసార్లు తమన్నా కెరీర్ క్లోజ్ అయిందని కామెంట్స్ వినిపించాయి.  అంతెందుకు లాస్ట్ నవంబర్.. డిసెంబర్ లో కూడా ఇదే టాక్ విన్పించింది.  కానీ ఎప్పుడైతే 'F2' రిలీజ్ అయిందో అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం తో తమన్నా కెరీర్ పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇదిలా ఉంటే తమన్నా నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.


అందులో ఒకటి హిందీ ఫిలిం 'ఖామోషి' కాగా మరో సినిమా 'అభినేత్రి 2'. ఈ రెండు సినిమాలు మే 31 న రిలీజ్ అవుతున్నాయి.  'అభినేత్రి 2' సినిమా విషయమే తీసుకుంటే ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించిన 'అభినేత్రి' అనే హారర్ కామెడీకి సీక్వెల్.  సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  ఈ  సినిమానుండి 'రెడీ రెడీ' అంటూ సాగే వీడియో సాంగ్ ను రేపు రిలీజ్ చేయడానికి ఫిలిం మేకర్స్ ప్లాన్ చేశారు. 


ఈ విషయం తెలుపుతూ ఆ పాట నుండి ఒక హాట్ స్టిల్ రిలీజ్ చేశారు.ఈ స్టిల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా మెరూన్ కలర్ దుస్తుల్లో ఉంది.  నీటిలో జలకాలాడుతూ తన హాట్ నెస్ ను పూర్తిగా బైటకు తీసింది.  అసలే తడి అందాలు.. ఆపై లైటింగ్.. పాలరాతి శిల్పంలాగా మెరిసిపోతోంది.  గెటప్ మాత్రమే కాదు. తమన్నా ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. ఈ పాట వాలకం చూస్తుంటే బాహుబలి లోని 'పచ్చ బొట్టేసిన' సాంగ్ లోని తమన్నా గ్లామర్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో అనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: