ప్రభాస్ అన్నమాట ప్రకారం ఈరోజు నుంచి ‘సాహో’ ప్రమోషన్ కు శ్రీకారం చుట్టాడు. ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలలో 2019 మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అంటూ ప్రకటించి మరోసారి ప్రభాస్ తన అభిమానులకు జోష్ ను కలిగించినా ఈపోస్టర్ లో కొన్ని సమాధానంలేని ప్రశ్నలు దోబూచు లాడుతున్నాయి. 

ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియోలు ద్వారా ఈమూవీ పై అంచనాలు పెంచిన ప్రభాస్ ఈరోజు విడుదలైన పోస్టర్లలో ముసుగు దొంగలా ముఖాన్ని కప్పుకుని కనిపించడంతో ప్రభాస్ ఈమూవీలో   దొంగా పోలీసా? అన్న సస్పెన్స్ ని ఈ పోస్టర్ లీడ్ చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు.  ఈ పోస్టర్ లో  ప్రత్యేకమైన ఎల్లో లెన్స్ ఉన్న డిజిటల్ కళ్లజోడును పెట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ ను బట్టి ప్రభాస్  చీకట్లోనూ మనుషులను చుట్టూ ఉన్న పరిసరాల్ని   పరిశీలిస్తాడా? అసలు ఈ ఆపరేషన్ దేనికోసం? అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులకు విపరీతంగా వస్తున్నాయి. 

అంతేకాదు ‘సాహో’ చిత్రంలో ప్రభాస్ ని ఒకే కోణంలో చూపిస్తున్నారా?  అతడి పాత్రలో ఇంకేదైనా  షేడ్ ఉందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ మూవీలో  ప్రభాస్ రోల్ గురించి ఎటువంటి లీకులు రాకపోవడంతో ఎవరికి వారు వారివారి ఊహలను బట్టి ఈ సినిమా కధను ఊహించు కుంటున్నారు.  

హాలీవుడ్ మూవీ ట్రాన్స్ ఫార్మర్స్ తరహాలో ఈమూవీలో యాక్షన్ సీన్స్ ఉండబోతున్న నేపధ్యంలో ఈసినిమాతో తెలుగు సినిమా మరో ఎత్తుకు వెళుతుంది అన్న అంచనాలు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో ఏర్పడ్డాయి. 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీతో ప్రభాస్ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తాడని అభిమానులు కలలు కంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: