సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా మహర్షి. మే 9న రిలీజైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇప్పటికే మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ సాధించే దిశగా పరుగులు తీస్తున్న మహర్షి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులకు ఎసరు పెడుతుంది.


ఇక సినిమా రిలీజ్ వారం ముందునుండి ఆఫ్టర్ రిలీజ్ వరకు ప్రమోషన్స్ చేసి అలసిపోయిన మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేశాడు. అయితే మహర్షి సినిమా హంగామా తగ్గకున్నా ఫ్యాన్స్ కు మరో స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు మహేష్. మహర్షి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. షూటింగ్ టైంలో ఎలా గడిచిందో ఈ మేకింగ్ వీడియోలో తెలుస్తుంది.


రామవరం సెట్ తో పాటుగా గ్రీన్ మ్యాట్ పై తీసిన షాట్స్.. ఇంకా వందల కొద్ది జూనియర్ ఆర్టిస్టులు.. డెహ్రాడూన్ లో కాలేజ్ సీన్స్.. ఇలా అన్నిటిని మేకింగ్ వీడియోలో కవర్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులకు మేకింగ్ వీడియోని తెగ ఎంజాయ్ చేస్తాడు. ఇక షూటింగ్ మొత్తంలో మహేష్ ఎనర్జీ సూపర్ అనిపించేలా ఉంది.


మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిన మహర్షి.. కలక్షన్స్ లో కూడా ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: