జ‌ర్నీ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది అంజ‌లి. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు చిత్రంతో మంచి పేరును సంపాదించుకుంది. హార‌ర్ చిత్రాల పై మ‌క్కువ ఎక్కువ చూపిస్తున్న ప్ర‌స్తుతం ఉన్న హీరోయిన్ల‌లో అంజ‌లి ఒక‌రు. గ‌తంలో గీతాంజలి, చిత్రాంగథ వంటి హారర్ చిత్రాల్లో నటించి మెప్పించిన అంజలి మరోసారి ‘లిసా’ చిత్రంతో దెయ్యం అవతారం ఎత్తింది. రాజు విశ్వనాథ్ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తమిళ్‌లో ఇప్పటికే విడుదల చేయగా.. తాజాగా తెలుగు వెర్షన్ టీజర్‌ను విడుదల చేశారు. ‘24’ చిత్రానికి రచనా సహకారం అందించిన రాజు విశ్వనాత్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
పాపా.. పాపా కథ చెప్పనా.. కాకి.. నక్కల కథ చెప్పనా? అంటూ మకరంద్ దేశ్ పాండే భయానక రూపంతో ప్రారంభమైన ఈ టీజర్ అన్ని హారర్ సినిమాల మాదిరే అచ్చుగుద్దినట్టు అనిపిస్తుంది. త్రీడీ టెక్నాలజీతో దెయ్యాన్ని చూపించి థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పాత ఫామ్ హౌస్‌.. అందులో ఓ దెయ్యం.. కుర్చీలు ఊగడం.. కర్టెన్స్ కదలడం.. కరెంట్ పోవడం లాంటివి బ్లాక్ అండ్ కాలం నుండి చూస్తునే ఉన్నాం. అయితే హారర్ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. ఇక టీజర్‌తో  భయపెట్టిన అంజలి దెయ్యం.. ‘లిసా’ మూవీతో దడపుట్టిస్తుందేమో చూడాలి. 
రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో వీరేశ్ కాసాని సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అతిథిగా విచ్చేసిన 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం హీరోయిన్ అంజలితో కలిసి చిత్ర ఆడియో బిగ్ సీడీని రిలీజ్ చేశారు. గ‌తంలో త‌ను న‌టించిన‌  'షాపింగ్‌మాల్‘, 'జర్నీ‘ సినిమాలను తెలుగులో విడుదల చేయమని అంజలినే సూచించారు. ఆయా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమా కూడా ఆమెనే చెప్పారు. హర్రర్ జోనర్‌లో త్రీడీ సినిమా రావడం ఇదే తొలిసారి. తెలుగు ఆడియెన్స్‌కి బాగా నచ్చుతుందని, వారు ఎంజాయ్ చేస్తారని ఈ చిత్ర హక్కులు తీసుకున్నా.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది. ఈ సమ్మర్‌కి మరో బ్లాక్ బస్టర్ అవుతుంది‘ అని నిర్మాత సురేష్ కొండేటి చెప్పారు. అంతేకాక ఈ చిత్రం త‌న కెరీర్‌లో ఓ మైలురాయిలాగా నిలుస్తుంద‌ని ఇటీవ‌లె మీడియాతో అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: