కింగ్ నాగార్జున ఇప్పటికీ నవ యవ్వనంగా ఉంటారని టాలీవుడ్ టాక్.  ప్రస్తుతం ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా వస్తున్నారు.  అయినా కూడా నాగార్జున వారికి పోటీగా నటిస్తున్నారు.  ఆ మద్య సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు.  నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలిచిపోయిన వాటిలో ‘మన్మథుడు’ఒకటి. 

తాను ప్రేమించిన అమ్మాయి దారుణంగా మోసం చేసిందని తెలిసి..అమ్మాయిలంతా ఇంతే అని ద్వేశం పెంచుకుంటాడు..ఆ తర్వాత నిజం తెలిసి తనను ఎంతగానో అభిమానించే హీరోయిన్ కోసం నానా కష్టాలు పడతాడు.  ఈ సినిమాలో ఎమోషన్స్, కామెడీ, సెంటిమెంట్ చాలా బాగా వర్క్ ఔట్ అయ్యాయి.  దాదాపు 17 ఏళ్ల క్రితం విడుదలైన మన్మథుడు చిత్రం నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 వస్తోంది. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక  మన్మథుడు మూవీలో  నాగార్జున, సోనాలి బింద్రే మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది.  తాజాగా ఇప్పుడు నాగ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.  ఇటీవల మన్మథుడు 2 చిత్రయూనిట్ పోర్చుగల్ లో కీలకమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చింది. తాజాగా ‘మన్మథుడు2’సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నాగార్జున, రకూల్ రొమాంటిక్ ఫోజులో కనిపిస్తున్నారు. మరో ఫొటోలో నాగార్జున కెమిస్ట్రీ ల్యాబ్ లో ఏదో ప్రయోగం చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఇందులో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు. ఈ మూవీ నాగార్జున, పి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: