తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న మూవీ “శశి లలిత”. జయం మూవీస్‌ బ్యానర్‌పై ‘శశి లలిత’ అనే చిత్రం నిర్మిస్తున్నట్లు చిత్ర దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.తమిళ ప్రజలు అమ్మగా భావించే ప్రజానేత జయలలిత మృతి వెనుక ఉన్న రహస్యాలు ప్రజల ముందుంచే ప్రయత్నమే నా ఈ చిత్రం అని ఆయన తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు.


చిత్ర యూనిట్‌తో కలిసి సోమవారం ఇంద్రకీలాద్రి పై శ్రీదుర్గా మల్లేశ్వర అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కేతిరెడ్డి ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలో ఘాటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జయలలిత పాత్రను కాజోల్‌ దేవగన్‌, శశికళ పాత్రను అమలాపాల్‌ పోషించనున్నారని పేర్కొన్నారు. జయలలిత జీవితంలోని మహిషాసురుల నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే శక్తి తనకు ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.


జ‌య‌ల‌లిత ఒక మంచి న‌టిగానే కాకుండా త‌మిళ నాట అమ్మ‌గా మంచి నాయ‌కురాలిగా పేరును సంపాదించుకుంది. అంత‌పేరున్న ఆమె గురించి బ‌యోపిక్ తీయ‌డం అంటే సాధార‌ణ‌మైన విష‌యం కాదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ద‌ర్శ‌కుడికి ఇది క‌త్తిమీద సాములాంటి ప‌ని. ఇక ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా తియ్యాల్సిన చిత్ర‌మిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: