తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషలను కూడా కవర్ చేస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు రానా దగ్గుబాటి. తెలుగు, హిందీలో.. తమిళంలో స్ట్రెయిట్ సినిమాల్లో నటించడం రానాకు కొత్తేమికాదు. ఇక రీసెంట్‌గా రానా బాలీవుడ్ ఫిలిం 'హౌస్ ఫుల్ 4' లో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటుగా రితీష్ దేశ్ ముఖ్.. బాబీ డియోల్ లాంటి హీరోలు నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం రానా హైదరాబాద్.. ముంబై అప్ & డౌన్ చేస్తూ ఉన్నాడు. 


అయితే ఈ సినిమా షూట్ పూర్తయ్యే లోపు రానా ముంబైకి మకాం మార్చే అవకాశం ఉందని లేటెస్ట్ న్యూస్.. కారణం ఏంటంటే ఎంటీవీ నిర్వహిస్తున్న 'ఏస్ ఆఫ్ స్పేస్' సెకండ్ సీజన్ కోసం హోస్ట్ గా చేసేందుకు రానాను సంప్రదించారట.  ఈ షో మొదటి సీజన్ కు వికాస్ గుప్తా హోస్ట్ గా వ్యవహరించాడు.  ఒకవేళ సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు రానా కనుక ఒప్పుకుంటే ఆ సీజన్ అయిపోయేంతవరకు రానా ముంబైలోనే ఉండాల్సి వస్తుంది. బిగ్ బాస్ లాగా ఇది కూడా రియాలిటీ షో కావడంతో హోస్టుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది.


ఇక రానాకు టీవీ షోలకు హోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే 'నెం.1  యారీ విత్ రానా' షో రానాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. అయితే అది తెలుగు ప్రేక్షకుల కోసం డిజైన్ చేసిన షో.  ఈ 'ఏస్ అఫ్ స్పేస్' మాత్రం ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ చేసున్న షో. మరి రానా ఈ షోకు ఒప్పుకుంటాడో.. ముంబైకి మకాం మారుస్తాడో లేదో వేచి చూడాలి. ఒకవేళ  ఈ షో ఒప్పుకుంటే మాత్రం రానా క్రేజ్ మామూలుగా ఉండదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: