సాహో ఫస్ట్ లుక్ ఈ ఉదయం రిలీజ్ అయ్యింది.  సాహో కు సంబంధించి ఓ న్యూస్ ఉండబోతుందని డార్లింగ్ ప్రభాస్ నిన్న చెప్పడంతో అందరిలోను తెలియని ఆసక్తి నెలకొంది.  సాహో నుంచి ఏం రాబోతోందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు.  అయితే, సాహో నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు.  


ఎంతగానో ఎదురుచూసిన లుక్ చూసి అందరు షాక్ అయ్యారు.  ప్రభాస్ నుంచి ఎదురుచూస్తున్న లుక్ అది కాదని,  కొత్తగా ఉంటుందని ఆశించారు.  కానీ, వాళ్ళు ఆశించిన దానికి భిన్నంగా ఉండటంతో  పాపం ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.  స్పై లుక్ పేరుతో దీన్ని రిలీజ్ చేసినా.. రెబల్ స్టార్ ప్రభాస్ కోరుకునేది మాస్ లుక్ ని.  ఆ మాస్ లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించలేదు.  


ఏదో ఫారెన్ మూవీలా ఉందని, ప్రభాస్ అంటే వర్షం, ఛత్రపతి, మిర్చి లాంటి మాస్ లుక్ కావాలని ఫ్యాన్స్ అంటున్నారు.  ప్రభాస్ ఇండియన్ కంటెంట్ కు దూరంగా వెళ్లి విదేశాలతో అటాచ్మెంట్ ఉండే సినిమాలు చేస్తున్నారు.  బాహుబలి తరువాత ప్రభాస్ కు మార్కెట్ పెరగొచ్చు.  కాకపోతే, ఇండియన్ టచ్ ఉన్న సినిమాలు చేస్తే... ఇక్కడి ఫ్యాన్స్ విపరీతంగా చూస్తారు.  ఫారెన్ లో ఎవరు చూస్తారు అన్నది ఫ్యాన్స్ అభిప్రాయం.  బాహుబలి మల్టీస్టారర్ పైగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో సినిమా సూపర్ హిట్టైంది.  ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం.  


 
 ఫ్యాన్స్ కు మాత్రం ఈ పోస్టర్ పిచ్చపిచ్చగా నచ్చింది.  మాములు ప్రేక్షకులు మాత్రం అబ్బే అంత గొప్పగా ఏముంది అని పెదవి విరుస్తున్నారు.  ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ. 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.  పెట్టింది తిరిగి వస్తుందంటారు.. చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: