మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి సూపర్ హిట్టైంది.  ఈ సినిమా హిట్ తరువాత తన పద్దతికి భిన్నంగా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.  థియేటర్స్ కు వెళ్లి ఫ్యాన్స్ ను పలకరించాడు.  విజయవాడలో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొని సందడి చేశాడు.  ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళాడు మహేష్ బాబు.  25 రోజుల విదేశీ ట్రిప్ తరువాత మహేష్ తిరిగి ఇండియాకు వస్తాడట.  వచ్చిన తరువాత మహేష్.. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.  


ఇక్కడ విషయం ఏమిటంటే.. మహేష్ 26 వ సినిమా లాంచింగ్ ఎప్పుడు జరగబోతుంది అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది.  26 వ సినిమా మే 31 వ తేదీన అధికారికంగా లాంచింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది.  మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.  మహేష్ సినిమా లాంచింగ్ చేయడానికి ఆరోజు కంటే మంచిరోజు ఏముంటుంది.  పైగా మహేష్ తన సినిమా లాంచింగ్ వేడుకలకు హాజరుకాదు.  ఇది మహేష్ సెంటిమెంట్.  ఎప్పటినుంచో ఇలాగే జరుగుతున్నది.  


సో, మహేష్ 26 వ సినిమాను మే 31 వ తేదీన అధికారికంగా లాంచింగ్ చేసి, జూన్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.  జూన్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభిస్తే ... వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నది యూనిట్.  దానికి అనుగుణంగానే షెడ్యూల్ ను కూడా ఫిక్స్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: