‘సాహో’ ప్రమోషన్ ను మరింత వేగవంతం చేస్తూ నిన్న విడుదల చేసిన పోస్టర్ విడుదలై ఒక్కరోజు గడవకుండానే ఆ పోస్టర్ చుట్టూ కాపీ వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. ఈ పోస్టర్ డిజైనింగ్ హాలీవుడ్ మూవీ ‘హ్యoకాక్’ లోని హీరో లుక్ ను పోలి ఉంది అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

దీనితో ‘సాహో’ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని జరుగుతున్న ప్రచార నేపధ్యంలో ఇలా పూర్తిగా హాలీవుడ్ మూవీల సీన్స్ ను ఆ సినిమాలలో నటించిన హీరోల
లుక్ ను కాపీ కొట్టే మూవీగా మారుతుందా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. గతంలో రాజమౌళి ‘బాహుబలి’ విషయంలో కూడ ఇలాంటి విమర్శలు వచ్చాయి. 
అయితే అప్పుడు రాజమౌళి వెంటనే రంగంలోకి దిగి మరో సినిమాలలోని  సీన్స్ ను కాపీ కొట్టడం వేరు అనుసరించడం వేరు అంటూ క్లారిటీ ఇచ్చి తన పై పడ్డ కాపీ మరకలను తోలిగించు కోవడానికి జక్కన్న తనవంతు ప్రయత్నం చేసాడు.

ఇప్పుడు ‘సాహో’ విషయంలో కూడ ప్రభాస్ తన గురువు రాజమౌళిని అనుసరిస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  ఆగష్టులో విడుదల కాబోతున్న ఈమూవీ ప్రచారానికి సంబంధించి మీడియాలో విపరీతమైన ప్రచారం క్రియేట్ చేసుకోవడానికి ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు మేకింగ్ వీడియోలు పోస్టర్లు ఇలా వారానికి ఒకటి చొప్పున జూలై నెలాఖరు వరకు విడుదల చేయబోతున్నట్లు సమాచారం

. తెలుస్తున్న సమాచారం మేరకు ఇటీవల పార్క్ హైయత్ హోటల్ లో ప్రభాస్ కు ఒక స్పెషల్ ఫోటో షూట్ చేసినట్లు టాక్. ఈ ఫోటో షూట్ నుంచి రెడీ పెట్టిన పోస్టర్లలో నిన్న విడుదల చేసిన పోస్టర్ ఒకటి అని అంటున్నారు. ఇది కాకుండా ప్రభాస్ గన్ పట్టుకున్న పోస్టర్ ఒకటి అదేవిధంగా ప్రభాస్ హీరోయిన్ తో ఉండే పోస్టర్ మరొకటి మరో రెండు వారాలలో విడుదల చేస్తూ ఈమూవీ పై హైక్ పెంచి బయ్యర్ల నుండి భారీ ఆఫర్స్ రాబట్టుకోవడానికి ఈ పదకాలు రచించినట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: