రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్య మరింత హాట్ గా తయారవుతుంది. ట్విట్టర్ లో హాట్ ఫొటోలతో అభిమానులను రెచ్చగొడుతుంది. ఈమధ్య రకుల్ తాజా బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా పూటకో డ్రెస్.. పూటకో ఫోటో షూట్ అన్నట్టుగా రెచ్చిపోయింది.  అసలవి ఏం ఫోటోషూట్లురా బాబూ.. దుమ్ము లేపింది.   సహజంగా అవకాశాలు లేనివారు అలా రెచ్చిపోయి ఫోటో షూట్లు చేస్తుంటారు.


కానీ రకుల్ కు చేతిలో ఆఫర్లు ఉన్నా రెచ్చిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఒక సెన్సేషనల్ ఫోటో షూట్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. థింక్ మార్కెటింగ్ మ్యాగజైన్ కోసం ఈ ఫోటో షూట్ చేసింది రకుల్. బ్లూ కలర్ లో ఉన్న టాప్.. డెనిమ్ జీన్స్  ను ధరించిన రకుల్ ప్యాంట్ జిప్ ను తొలగించి నాభి అందాలను పూర్తిగా ప్రదర్శనకు పెట్టింది. రకుల్ కూర్చున్న స్టైల్ కూడా మామూలుగా లేదు. వీటికి తోడు రకుల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది.


ఈమధ్య కాలంలో రకుల్ చాలా ఫోటో షూట్లు చేసింది కానీ డౌట్ లేకుండా ఇది సెన్సేషనల్.  సంప్రదాయవాదులైతే రకుల్ పై విరుచుకు పడవచ్చు.. కే.రాఘవేంద్రయిజం ఫాలో అయ్యేవారైతే మేలురకం ద్రాక్ష.. బత్తాయిల కోసం వెంటనే పండ్లమార్కెట్ కు పరిగెత్తవచ్చు!రకుల్ సినిమాల విషయం మాట్లాడుకుంటే అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో సూర్య 'NGK'.. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కే మరోచిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో 'మర్జావా' అనే చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: