డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే ఒక మంచి కాఫీలాంటి సినిమాలు తీసే డైరెక్టర్ అని గుర్తిస్తారు పరిశ్రమలో. తన మొదటి సినిమా అయిన “ఆనంద్” తోనే అతని స్టామినా అందరకి అర్ధం అయ్యింది. చాల విలక్షణమైన , ఫీల్ గుడ్ కధలతో మనముందుకు వస్తుంటారు శేఖర్. ఆనంద్ సినిమా చూస్తుంటే కధ కంటే కూడా దర్శకత్వం తో ఆ కధను ప్రేక్షకుల ముందుకు అయన తీసుకునివచ్చిన విధానం అద్బుతమనే చెప్పాలి.

 

అందుకే శేఖర్ సినిమాలు ఏన్ని సార్లు అయిన చూడొచ్చు అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. అందుకే అతనికి అంత ఆదరణ. ఆనంద్ తరువాత “హ్యాపి డేస్” సినిమా తీసి కుర్రకారుకి మరింత దగ్గరయ్యారు శేఖర్ కమ్ముల. ప్రతీ స్టూడెంట్ యొక్క ఇంజనీరింగ్ డ్రీం ను ఒక కొత్త వోరవడితో , కాలేజీ లైఫ్ ఇంత్త బావుంటుందా అనిపించేలా ఏ డైరెక్టర్ తీయని విధంగా ఆ సినిమా ను చిత్రీకరించారు శేఖర్.

 

యువ నటులు నిఖిల్, తమన్నా పరిచయం అయింది ఆ సినిమాతోనే. హ్యాపి డేస్ సినిమా చూసి చాల మంది కుర్రకారు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారంటే అతిశయోక్తి లేదు. అంతలా ఆ  సినిమా యూత్ మీద ప్రభావం చూపించింది. హ్యాపి డేస్ లాంటి హిట్ తరువాత శేఖర్ కమ్ములకు ఆ రేంజ్ హిట్ చేసింది “ఫిదా” సినిమా. ఈ సినిమా శేఖర్ కమ్ములా ను ఇంకో రెండు మెట్లు ఏక్కించింది.

 

“ఫిదా” సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించింది. ఒక కొత్త శేఖర్ కమ్ముల కనిపించాడు ఫిదా సినిమాతో. అయితే ఫిదా సినిమా తరువాత శేఖర్ కమ్ముల నుండి ఒక్క అప్డేట్ కుడా రాకపోవడంతో చాల ఆశ్చర్యం వేసింది ఆడియన్స్ కి. శేఖర్ కమ్ముల ఒక కొత్త కధతో మనముందుకు రాబోతున్నాడట. కాని చాల సైలెంట్ గా అయన కొత్త సినిమాను తెరకేక్కిస్తున్నారట. ప్రస్తుతం ఆ సినిమా దుబాయ్ లో షూటింగ్ జరుగుతుంది అని వినికిడి.


మరింత సమాచారం తెలుసుకోండి: