సామాజిక స్పృహతో కూడిన కథను ఎంచుకుని ఆకథను టాప్ హీరోలతో తీసి కమర్షియల్ సక్సస్ అందుకునే టెక్నిక్ కొరటాల శివకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అందువల్లనే ఈ దర్శకుడు తీసిన సినిమాలు అన్నీ వరస ఘన విజయాలు సాదిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో కొరటాల ప్రయోగించిన టెక్నిక్ ను ప్రస్తుతం చాలామంది యంగ్ డైరెక్టర్స్ అనుసరిస్తూ కొరటాల చేసిన ప్రయోగానికి విలువ లేకుండా చేస్తున్నారు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత సంవత్సరం విడుదలైన ‘భరత్ అనే నేను’ మూవీలో మహేష్ నటించిన ప్రెస్ మీట్ సన్నివేసం ఆమూవీ ఘన విజయానికి కారణం అయింది. 

ఇప్పుడు అదే టెక్నిక్ ను చాలామంది దర్శకులు అనుసరిస్తున్నారు. ‘మహేష్’ లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ లో మహేష్ ను చెట్టు కింద నుంచుని ప్రెస్ మీట్ సన్నివేశాన్ని వంశీ పైడిపల్లి డిజైన్ చేసిన ఆసీన్ పెద్దగా కనెక్ట్ కాలేదు. అదేవిధంగా నాని నటించిన ‘జెర్సీ’ మూవీ క్లైమాక్స్ లో అంతా మీడియా మీట్ సన్నివేశాలే కనిపిస్తాయి. 

ఇక లేటెస్ట్ గా అల్లు శిరీష్ కూడ తన ‘ఎబిసిడి’ సినిమా కోసం మీడియా మీట్ సన్నివేశాలు సృష్టించుకున్నాడు. అయితే ఈ ప్రెస్ మీట్ సన్నివేశాలు ఏవీ కూడ కొరటాల శివ ‘భరత్ అనే నేను’ కోసం క్రియేట్ చేసిన ప్రెస్ మీట్ సన్నివేశాల స్థాయిలో ప్రేక్షకులలో ఉద్వేగాన్ని క్రియేట్ చేయలేకపోయాయి. దీనితో కొరటాల సృష్టించిన ప్రెస్ మీట్ సీన్స్ ను కాపీ కొట్టాలని ప్రయత్నిస్తున్న చాలామంది దర్శకుల ఎత్తుగడలు ఫెయిల్ అవుతున్న పరిస్థుతులలో కొరటాల క్రియేట్ చేసిన ప్రెస్ మీట్ సన్నివేశాలు తెలుగు సినిమా దర్శకులను ఒక విధంగా పాడుచేస్తోంది అంటూ కొందరు ప్రస్తుతం ఇండస్ట్రీలో సెటైర్లు వేస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: