కాజల్ అలా అమాయకంగా కనిపించే మిత్రవింద కాదు. ప్రేమించిన మగధీరున్ని చేరుకోలేక బలైపోయిన ఆమాయకపు రాచ కన్య  అంతకంటే కాదు. ఆమె చూపులతోనే చంపేస్తుంది. ఆ చూపుల వేడికి వేసవి ఎండలు సైతం దిగదుడుపే. అవే చూపులతో  కత్తులు విసగలదు, కైపులు ఎక్కించగలదు. 


అందలా చందమామ కాజల్ అనుకుంటే కాదు ఖతర్నాక్ అంటున్నారు తేజ. ఆయన తీసిన సీత మూవీ ఈ నెల 24న అన్ని ధియేటర్లలోకి వస్తోంది. మరి ఇందులో సీత అంటే బుద్దిగా తలదించుకునే అమ్మాయి కాదుట. ఇంటలిజెన్స్ కలిగిన డేరింగ్ అండ్ ద్యాషింగ్ లేడీ అంటున్నారు. ఆమె ముందు విలన్లు  బలాదూర్ అంటున్నారు తేజా.


ఇక ఆల్ట్రామోడర్న్ సీతగా కాజల్ ఒక్కరే బాగా సూట్ అవుతారని కూడా తేజా కితాబు ఇచ్చేశారు. సీత పక్కన మంచి బాలుడిగా, ఆమెకు తోడుగా ఉంటూ ఫైటింగులు చేసే రఘు రాముడిగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నారు. ఈ రోల్ అల్లుడు శ్రీను బాగా చేశాడని అంటున్నారు. ఇక ఈ నాటి రావణుడుగా సోనూ సూద్ డ్రామా  పండించారని చెబుతున్నారు. చూడాలి సీత మరెన్ని వండర్స్ చేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: