‘ఎఫ్ 2’ సూపర్ సక్సస్ తరువాత పంజాబీ బ్యూటీ మెహరిన్ కౌర్ కు చాల అవకాశాలు వస్తాయని భావించారు. అయితే ఆమె వంక టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కానీ పెద్దగా పేరులేని యంగ్ హీరోలు కానీ ఎవరు పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ఆమె అవకాశాల గురించి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమెకు ఎక్కడా ఛాన్స్ లు రాకపోవడంతో ప్రస్తుతం ఈమె గోపీ చంద్ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీలో గోపీ చంద్ పక్కన ప్రస్తుతం ఈమె నటిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడు ఈమె సీనియర్ హీరోలకు దేవతగా మారబోతోందా అన్న సందేహాలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభించబోతున్న మూవీలో మెయిన్ హీరోయిన్ గా మెహరిన్ ఎంపిక అయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య వయసులో ఉన్న సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్యలు ఏర్పడటంతో మెహరిన్ ఆ సమస్యలను తీర్చగలుగుతుందా అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

‘రాజా ది గ్రేట్’ ‘మహానుభావుడు’ ‘ఎఫ్ 2’ లాంటి సినిమాలలో నటించి వరస విజయాలు అందుకున్నా మెహరిన్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదు అన్న విషయమై అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలయ్య చేతిలో ఈమె పడింది కాబట్టి ఇప్పటి నుండి అయినా ఈమెకు ఆమె కోరుకున్న స్థాయిలో అవకాశాలు వస్తాయేమో చూద్దాం..  


మరింత సమాచారం తెలుసుకోండి: