యువ హీరో విజయ్ దేవరకొండ లవ్ బ్రేకప్ అయ్యిందా.. హీరోగా వరుస హిట్లతో మంచి ఫాం లో ఉన్న విజయ్ దేవరకొండ ఎవరిని ప్రేమించాడు.. ఎందుకు లవ్ బ్రేకప్ చెప్పాడు అంటే ఇది రియల్ లైఫ్ లవ్ బ్రేకప్ కాదు రీల్ లైఫ్ లవ్ బ్రేకప్. అదేంటి అనుకుంటున్నారు కదా ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.


కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఫారెన్ మోడల్ ఇజబెల్ లీట్ నటిస్తున్నారట. ఒక హీరోయిన్ ఉంటేనే ముద్దుల హంగామా చేసే విజయ్ ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా బ్రేకప్ అని పెడుతున్నారట.


సినిమాలో మనోడు లవ్ లో పడటం పరిస్థితుల కారణంగా బ్రేకప్ చెప్పడం ఇదే పనట. ఇద్దరితో ఇలా జరిగి మూడో హీరొయిన్ తో లవ్ సక్సెస్ అవుతుందట. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు బ్రేకప్ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ సినిమాల పంథాలోనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ బ్రేకప్ ఉండబోతుందని తెలుస్తుంది.


ఈ సినిమాతో పాటుగా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా హీరో కూడా ఈమధ్యనే మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తుంది.. మొత్తానికి విజయ్ మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: