యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి వచ్చిన మేకింగ్ వీడియోస్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.


ఇదిలాఉంటే ఇప్పుడు ఓ సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. ప్రభాస్ సాహో సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడట. సినిమాలో ఓ చిన్న కెమియో రోల్ లో సల్మాన్ కనిపిస్తాడని అంటున్నారు. ఓ క్రేజీ ఫైట్ సీన్ లో ప్ర్భాస్ తో పాటుగా సల్మాన్ స్పెషల్ ట్రీట్ ఇస్తాడట.


ఈ కెమియో ఇచ్చేందుకు సల్మాన్ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తుంది. ప్రభాస్ తో సల్మాన్ ఊహించుకుంటేనే థ్రిల్ అనిపిస్తున్న ఈ సాహో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా వస్తున్న సాహో సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.


చిత్రయూనిట్ మాత్రం సినిమా అవుట్ పుట్ మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ డబుల్ అవడం గ్యారెంటీ అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేయాలనుకున్నాడో సాహో అందుకు పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. మరి సాహో సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరో 3 నెలలు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: