తమిళ హీరో సూర్యకు తెలుగు లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  గజినీ సినిమా నుంచి సింగం 3 వరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.  తెలుగు హీరోలతో సూర్యకు ఎంతో మంది సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  అందుకే తెలుగులో కూడా సూర్యకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా సూర్యకు క్రికెటర్ సురేశ్ రైనా ఊహించని స్వీట్ షాక్ ఇచ్చాడు. 


ప్రస్తుతం సూర్య తాను నటించిన ‘ఎన్.జీ.కే’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.  ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని చాట్ చూసి సూర్య షాక్ తిన్నారు.  ఇంతకీ ఆ అభిమాని ఎవరా అనుకుంటున్నారా..స్టార్ క్రికెటర్ సురేష్ రైనా.  మీకు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ లో ఏ క్రికెట‌ర్ అంటే ఇష్టం?  అని ప్ర‌శ్నించాడు. దాంతో షాక్ నుంచి తేరుకున్న సూర్య మీకు నాతో మాట్లాడ‌టానికి స‌మ‌యం దొరికిందా? నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. 


మీ పాప గ్రేసియాతో పాటు అంద‌రినీ అడిగాన‌ని చెప్పండి. నాకు చెన్నై సూప‌ర్‌కింగ్స్‌లో ధోని అంటే చాలా ఇష్టం. సూప‌ర్‌కింగ్స్‌లో నేను క‌లిసిన తొలి ఆట‌గాడు ధోని. ఆ స‌మ‌యంలో మీరు నాకు హ‌లో చెప్ప‌డం ముచ్చ‌టేసింది. మ‌న ఇద్ద‌రం క‌లిసి దిగిన ఫోట‌ను నేను ఎప్ప‌టికీ భ‌ద్రంగా దాచుకుంటాను అని రైనా ప్ర‌శ్న‌కు హీరో సూర్య‌ స‌మాధానం ఇచ్చారు. ఇక సూర్య నటించిన ‘ఎన్‌జి‌కే’ ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: