తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న చైతూ-సమంత ఇటీవల ‘మజిలీ’చిత్రంతో మంచి విజయం అందుకున్నారు.  ఏం మాయ చేసావే సినిమాతో ఏర్పడ్డ పరిచయం తర్వాత పెళ్లి వరకు వచ్చింది.  గత ఏడాది వీరిద్దరూ రెండు సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.  
పెళ్లైన మూడు నెలల నుంచి సమంత, చైతూ ఇద్దరూ నటించడం మొదలు పెట్టారు. 

అయితే సమంత ఇటీవల కాలంలో తన ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతుంది.  ఒకప్పుడు బొద్దగా ఉండే సమంత ఇప్పుడు నాజూగ్గా తయారైంది.   ఈ మద్య వివాహం జరిగిన తర్వాత చాలా మంది హీరోయిన్లు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, నాజూకైన రూపాన్ని, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. 


ఫిట్ నెస్ కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చే సమంత తాజాగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ఔరా అనిపించింది. తన జిమ్ వర్కౌట్ లో భాగంగా సమంత అంత బరువును ఎత్తుతూ వ్యాయామం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: