ఇప్పుడు జంతువులను పెట్టి ఏ సినిమా చేయాలి అన్నా చాలా రిస్క్ తో కూడుకొని ఉంటుంది.  జంతువులను సినిమాలో చూపించాలి అంటే సదరు పరిరక్షణ ఆఫీస్ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి.  వాటికి ఏమైనా హింస కలిగించినట్టు సీన్ ఉంటె వాటిని తొలగిస్తారు.  అంతేకాదు దానికి సంబంధించిన ఫైన్ కూడా ఉంటుంది.  


అందుకనే ఇప్పుడు అలాంటి సీన్స్ ఉంచాలి అంటే వాటిని గ్రాఫిక్స్ ద్వారా చూపించుకుంటున్నారు.  ఇదివరకటి రోజుల్లో అంట స్ట్రిక్ట్ ఉండేది కాదు.  జంతువుల సీన్స్ కు సంబంధించిన సీన్స్ ఉన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు.  అందుకే అప్పట్లో గుర్రాలు, ఇతర జంతువులను సినిమాలో యూజ్ చేశారు.  బాలకృష్ణ భైరవద్వీపం సినిమాలో గుర్రాలను వాడారు.  ఓ సందర్భంలో గుర్రాలు కిందపడిపోతాయి.  వాటికి బాణాలు గుచ్చుకుంటాయి.  


ఈ సీన్స్ ను సెన్సార్ వాళ్ళు కట్ చేయలేదు.  కానీ, జంతు పరిరక్షణ సంస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వెంటనే కట్ చేయాలని దర్శక నిర్మాతలకు సూచించారు.  అదృష్ట వశాత్తు ఆ సినిమాపై వారి కన్ను పడలేదు.  సాధారణంగా గుర్రాలు కిందపడి సీన్ ను తీసేసమయంలో వాటి కాళ్లకు అడ్డంగా తీగ కడతారు.  పరిగెత్తేసమయంలో తీగ తగిలి కిందపడిపోతాయి.  ఆ వెంటనే రౌతులు, వాటి యజమానులు వచ్చి పైకి లేపి కళ్ళకు తగిలిన దెబ్బలకు కట్టుకడతారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: