ఒక మనిషికి ఏది ఎక్కువైనా దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం.  ఎందుకంటే... ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు.  మనం చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం.  సింగర్ గా బాగా ఎదిగిన తరువాత ఏం చేయాలో తెలియక డ్రగ్స్ కు బానిసయ్యి జీవితాలను నాశనం చేసుకుంటుంటారు.  నటుడిగా బాగా ఎదిగిన తరువాత హైఫై లైఫ్ కు అలవాటు పడి... ఆలైఫ్ కోసం అప్పులు చేసి దివాళా తీసిన వ్యక్తులు ఉన్నారు.  


అందుకే చాలామంది ఈ అప్పులు తీర్చలేక ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటారు.  ఇలాంటి సంఘటనే హాలీవుడ్ లో జరిగింది.  థోర్ సినిమాలో ఓ మంచి పాత్ర చేసిన నటుడు ఇసాక్ కుప్పి.  ఈయన కొన్ని కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నారు.  సోమవారం రాత్రి బ్రిడ్జి మీదనుంచి హైవైపై దూకాడు.  ఆ సమయంలో అటుగా వస్తున్న వాహనం డీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.  


ఇసాక్ కుప్పి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశారు.  ఈ నోట్ అందరిని ఆలోచనలో పడేసింది.  గత కొన్ని రోజులుగా నాకు నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను.  చాలా రోజుల క్రితమే ఇలా చేసి ఉండాల్సింది.  జీవితంలో చాలా తప్పులు చేశాను.  డబ్బుకోసం చాలామందిని వాడుకున్నాను.  డ్రగ్స్ కు అలవాటు పడ్డాను.  దీనివలన అనేక మందిని ఇబ్బందులు పెట్టాను.  నా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులు పెట్టాను.  నన్ను క్షమించండి.  అని చెప్పి రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: