ఆరెక్స్ 100 సినిమాతో యువత మనసులు గెలిచిన అమ్మడు పాయల్ రాజ్ పుత్. సినిమాలో ఆమె అందాల ప్రదర్శనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలర్స్ లో టివి షో యాక్ట్రెస్ అయిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. ఆరెక్స్ 100 సినిమా హిట్ అవడంతో అమ్మడికి ఓ రేంజ్ పాపులారిటీ వచ్చింది. వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటున్న పాయల్ షాప్ ఓపెనింగ్స్ కు బెస్ట్ ఆప్షన్ అయ్యింది.  


యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడితో షాప్ ఓపెనింగ్ చేయిస్తే ఫ్రీ పబ్లిసిటీ అని నిర్వాహకులు అనుకుంటున్నారు. అందుకే చేస్తున్న సినిమాలే కాకుండా నెలకి ఒకటో రెండో ఇలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్తుంది పాయల్ రాజ్ పుత్. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని సామెత ఉన్నట్టుగా అమ్మడు వీటి మీద కూడా భారీగా సంపాదించేస్తుంది. 


మాల్స్ ఓపెనింగ్స్ కు పాయల్ రాజ్ పుత్ అడిగినంత ఇచ్చేలా ఉన్నా కేవలం 3 లక్షలు మాత్రమే డిమాండ్ చేస్తుందట. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ కు మాల్ ఓపెనింగ్స్ కోసం 5 నుండి 8 లక్షల దాకా ఇస్తారు. అయితే తను అడిగినంత ఇచ్చే అవకాశం ఉన్నా సరే పాయల్ మాత్రం 3 లక్షలు చాలని అంటుందట.   


అంతేకాదు తన దగ్గరకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలుకోకూడదని ఫిక్స్ అయ్యిందట. ఆరెక్స్ 100 కూడా అలా వచ్చిన ఛాన్సే అని.. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేది లేదని అంటుంది పాయల్ రాజ్ పుత్. మొత్తానికి పాయల్ తెలుగులో భారీగానే సంపాదించుకునే ఛాన్స్ ఉంది. సీతలో ఐటం సాంగ్ చేసిన పాయల్ వెంకీ మామ సినిమాలో నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: