ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున నాగబాబు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడం జరిగింది. సరిగ్గా ఏపీలో ఎన్నికలకు నెలకు ముందు పార్టీలో చేరిన నాగబాబు ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ప్రచారం కోసం సుడిగాలి పర్యటనలు చేసి అందరికి షాక్ ఇచ్చారు.దీంతో నాగబాబు జబర్దస్త్ షోకి తాత్కాలికంగా దూరమయ్యారు. మరోపక్క వైసీపీ పార్టీ తరఫున కమెడియన్ ఆలీ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది.


అయితే ఎన్నికల అయిపోయింది ఫలితాలు వస్తున్న క్రమంలో ‘జబర్దస్త్’ షో లో కి మళ్ళి నాగబాబు వస్తారని అందరూ భావించారు కానీ తాజాగా మాత్రం నాగబాబు ‘జబర్దస్త్’ షో లో నుండి బయటకు వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. అంతేకాకుండా నాగబాబు స్థానంలో ఆలీ షోలో ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే వీటిలో వాస్తవం లేదని చాలామంది అంటున్నారు. జబర్దస్త్ షో స్టార్ట్ అయిన నాటి నుండి జడ్జీలుగా నాగబాబు మరియు రోజా వ్యవహరించేవారు.


న్యాయనిర్ణేతలుగా వారిద్దరి కాంబినేషన్ షో కి అదనపు గ్లామర్ తెచ్చిపెట్టేది. అయితే తాజాగా రాజకీయ కారణాల కోణంలో చూస్తే జబర్దస్త్ న్యాయనిర్ణేతలుగా నాగబాబు రోజా పరిస్థితి ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉందని..జగన్ పార్టీ అధికారంలోకి వస్తే రోజా మంత్రి అయ్యే అవకాశాలు ఉండొచ్చని...అలాగే నాగబాబు ఎంపీ అయితే పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడం వల్ల షో లో పాల్గొనడానికి టైం ఉండదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: