ఇప్పటి వరకు టాప్ హీరోల సినిమాలకు సంబంధించి టీజర్ లకు ట్రైలర్స్ కు సంబంధించిన లైకులు హిట్స్ రికార్డుల పై టాప్ హీరోల మధ్య పోటీ ఉండేది. అయితే ఇప్పుడు ‘సాహో’ ఒక కొత్త పోటీకి తెర తీయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘సాహో’ ప్రమోషన్ కు శ్రీకారం చుడుతూ విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్ కు కేవలం 24 గంటలలో 8 లక్షల లైక్స్ వచ్చాయి అంటూ జరుగుతున్న ప్రచారం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. 

అంతేకాదు ఒక సినిమా పోస్టర్ కు లైకుల రికార్డులు ఏమిటి అంటూ సెటైర్లు కూడ పడుతున్నాయి. దీనికితోడు ‘సాహో’ పోస్టర్ రికార్డుల పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న రగడ మరింత ఆశ్చర్యంగా మారింది. 

ఇప్పుడు ఈ రేంజ్ లో ప్రభాస్ అభిమానుల హంగామా కొనసాగుతూ ఉంటే ‘సాహో’ టీజర్ ట్రైలర్ లు విడుదల అయిన తరువాత వాటికి వచ్చే లైక్స్ రికార్డులను హైలెట్ చేస్తూ ప్రభాస్ అభిమానులు చేయబోయే హడావిడి ఏ రేంజ్ లో ఉండబోతోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్ లు ట్రైలర్ల రికార్డులు మేనేజ్ చేస్తున్నారు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ‘సాహో’ పోస్టర్ లైక్ ల రికార్డులు ఒక సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. 

అయితే ఈ లైక్ ల వ్యవహారం అంతా ‘సాహో’ మార్కెట్ కోసం అనుసరిస్తున్న వ్యూహాలు అనీ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు టాప్ హీరోల సినిమాల పై ఉండే మ్యానియాతో బయ్యర్లు ఆసినిమాల టీజర్లు ట్రైలర్స్ ను చూసి భారీ మొత్తాలకు కొనుక్కునే ట్రెండ్ కొనసాగుతూ ఉన్నంతకాలం ఈ రికార్డుల మ్యానియా కొనసాగుతూనే ఉంటుంది అనీ దానికి ‘సాహో’ మినహాయింపు కాదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: