టాలీవుడ్ లో చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ..నితిన్ హీరోగా ‘జయం’సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  అప్పట్లో ప్రేమ కాన్సెప్ట్ లపై బాగా వస్తున్నాయి..అనుకుంటున్న తరుణంలో మహేష్ బాబు లాంటి హీరోతో ‘నిజం’లాంటి మెసేజ్ సినిమా తీశారు.  కాకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోలేక పోయింది.  తర్వాత కొన్ని సినిమాలు తీసినా పెద్దగా కలిసి రాలేదు.


ఆ మద్య రానా తో ‘నేనే రాజు నేనే మంత్రి’ పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.  ఈ సినిమా తో తేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు..దాంతో ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు వస్తున్నారు.  ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వం వహిస్తానని అన్నా..మద్యలోనే తప్పుకున్నారు.  తాజాగా ‘సీత’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తేజ. కాజల్‌ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఇక సినిమాకు ‘సీత’ పేరు పెట్టడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్‌ మార్చాలని, సినిమాను తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని అంటున్నారు. ఈ విషయంపై స్పందించిన తేజా మీడియాతో మాట్లాడుతూ..ఈ మద్య ప్రతి సినిమాను విమర్శించడం బాగా నేర్చుకున్నారని..‘ ‘సీత’ కాకపోతే శూర్పణఖ అని టైటిల్‌ పెట్టాలా? నేనెందుకు మార్చాలి టైటిల్‌? నేను అస్సలు మార్చను. ‘సీత’ సినిమా ఇలాగే ఉంటది.


సెన్సార్‌ బోర్డు కూడా సర్టిఫికేట్‌ ఇచ్చేసింది. కాబట్టి నేను ఎవ్వరికీ సినిమా చూపించాల్సిన అవసరం లేదు. రేపు ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తానని..ఎవరు అడ్డు చెబుతారో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: