ఏపి ఎలక్షన్స్ రిజల్ట్ కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో చూస్తుంటే  స్పష్టంగా వైసిపి అధినేత జగన్ కే ఏపి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న విషయం అర్ధమవుతుంది. టఫ్ ఫైట్ అనుకున్న ఏపి ఎలక్షన్స్ కాస్త వార్ వన్ సైడ్ అయినట్టుగా ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వైసిపి 150 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతను తెచ్చుకుంది. 


అయితే టిడిపి మాత్రం 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎలక్షన్స్ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సంచలన దర్శకుడు ఆర్జివి ఓ ట్వీట్ చేశాడు. టిడిపి జననం 29 మార్చ్ 1982 కాగా.. మరణం మే 23 2019 అని ట్వీట్ చేశాడు. టిడిపి మరణానికి కారణాలు అంటూ అబద్ధాలు, వెన్నుపోటు, అవినీతి, నారా లోకేష్, వైఎస్ జగన్ అంటూ కామెంట్ పెట్టాడు. 


ఈమధ్యనే తాను తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఏపిలో రిలీజ్ కానివ్వకుండా చేశారని చంద్రబాబు మీద ఇండైరెక్ట్ ఎటాక్ చేశాడు వర్మ. ఏపిలో తప్ప మిగతా అన్ని చోట్ల లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా రిలీజై సక్సెస్ అయ్యింది. టిడిపిని ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడేసుకునే ఆర్జివి ఈరోజు ఎలక్షన్స్ ఫలితాల్లో టిడిపి వెనుకపడటంతో టిడిపికి ఇది చావుదెబ్బ అన్నట్టుగా ట్వీట్ చేశారు. 


ముందునుండి విజయం మీద ధీమాగా ఉన్న వైసిపి నేతలు వస్తున్న ఫలితాలను చూసి సంబర పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన ప్రభావం పెద్దగా కనబడటం లేదు. పవన్ మీటింగులకు జనాలైతే వచ్చారు కాని ఓట్ల రూపంలో మాత్రం మారలేదని తెలుస్తుంది. ఇక ఫైనల్ రిజల్ట్స్ ఏంటన్నది ఈరోజు రాత్రి వరకు తెలుస్తాయి. జగన్ గెలుపు గురించి ప్రస్థావిస్తూ కంగ్రాట్స్ వైఎస్ జగన్ అంటూ కండోలెన్స్ టూ సిబిఎన్ అంటూ మరో ట్వీట్ చేశారు ఆర్జివి. 



మరింత సమాచారం తెలుసుకోండి: