జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి ఎలక్షన్స్ లో ఘోర పరాజయపాలయ్యారు. తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు ప్రాంతాల్లో పవన్ ఓటమి పాలయ్యారు. గాజువాకలో వైసిపి అభ్యర్ధి నాగి రెడ్డి మీద ఓడిన పవన్ కళ్యాణ్ భీమవరంలొ గ్రంధి శ్రీనివాస్ పై గెలవలేకపోయారు. ఈ ఓటమి గురించి పవన్ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.  


ముఖ్యంగా జబరస్త్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది ఓడింది పవన్ కళ్యాణ్ కాదు ఏపి ప్రజలని ట్వీట్ చేశాడు. మొదటి నుండి పవన్ కు సపోర్ట్ గా ఉంటూ వచ్చిన ఆది పవన్ కళ్యాణ్ జనసేన తరపున పార్టీ ప్రచారాల్లో కూడా పాల్గొన్నాడు. పవన్ ప్రభంజనం సృష్టించడ్మ్ ఖాయమని అనుకున్నారు.


కాని ప్రజల తీర్పు వేరేలా ఉంది. పవన్ ఓటమిపై స్పందించిన హైపర్ ఆది మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈరోజు ఓడిపోయింది పవన్ కళ్యాణ్ కాదు ప్రజలు.. అంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇదో బ్లాక్ డే అని ట్వీట్ చేశాడు హైపర్ ఆది. ప్రజల తీర్పుని గౌరవించడం పార్టీ అధినేతలది అయితే.. తమ ఓటమిని అంగీకరించలేని వారు ఇలా స్పందించడం జరుగుతుంది.


జబర్దస్త్ షోలో హైపర్ ఆది పంచులకు బాగా క్రేజ్ ఉంది. అయితే పవన్ కు సపోర్ట్ గా ప్రచారం చేయడం ఓకే కాని ప్రజల తీర్పుని తప్పుబట్టే అధికారం మాత్రం ఎవరికి లేదు. కొద్దిసేపటి క్రైతమే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడటం జరిగింది. ప్రజల తీర్పుని గౌరవిస్తున్నా అంటూనే ప్రజల సమస్యల గురించి పోరాడుతానని అన్నారు పవన్.    



మరింత సమాచారం తెలుసుకోండి: