సాహో ప్రమోషన్ లో భాగంగా ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ లో కొందరు వ్యక్తులకు అవమానం జరిగింది అంటూ ప్రచారం మొదలైంది. 300 కోట్లభారీ బడ్జెట్‌ తో తీస్తున్న ఈమూవీ విషయంలో ఏ వార్త బయటకు వచ్చినా అది హాట్ న్యూస్ గా మారుతోంది. ఇలాంటి పరిస్థితులలో తాజాగా విడుదలైన ఈ మూవీ పోస్టర్ లో  ఒక ముఖ్యమైన అంశం మిస్సవ్వడం  వెనుక కారణం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 

సాధారణంగా సినిమాలకు రిలీజ్ చేసే పోస్టర్స్ లో ఆ మూవీ దర్శకుడు నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ పేర్లు లేకుండా విడుదల చేయరు. అయితే లేటెస్ట్ గా విడుదల చేసిన ‘సాహో’ పోస్టర్ లో ఆమూవీ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ ఎస్సాన్ లాయ్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఈమూవీ షూటింగ్ ప్రారంభించి చాలాకాలం అవుతున్నా మీడియాలో ఎక్కడా ఈమూవీ సంగీత దర్శకుల గురించి ప్రస్తావన రాలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు విడుదలైన ‘సాహో’ మేకింగ్ టీజర్ కు సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో ఈమూవీ సంగీత దర్శకులకు ఏమైంది అన్న సందేహాలు మొదలు కావడం ప్రారంభం అయింది. 

వాస్తవానికి ఈమూవీ ఆగష్టు 15న విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ రీ రికార్డింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ మొదలు కావలసి ఉంది. దీనితో ఈసినిమా నుండి శంకర్ ఎస్సాన్ లాయ్ లను తప్పించారా అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే బాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ గా చాల పేరున్న వీరిని తప్పించే సాహసం చేయరని మరికొందరు అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ‘సాహో' లో ఏమి జరుగుతోంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: