మెగా స్టార్ చిరంజీవిని ‘బాహుబలి’ తో పోలుస్తూ రామ్ గోపాల్ వర్మ చేసిన శుభాకంక్షల ట్విట్ సంచలనంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2009 లో జరిగిన ఎన్నికలలో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ 18 స్థానాలు గెలుచుకుని చిరంజీవి పోటీ చేసిన రెండు స్థానాలలో ఒక స్థానంలో అయినా గెలిచారని అయితే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోవడంతో వర్మ చిరంజీవి పవన్ కంటే గొప్పవాడని ప్రశంసిస్తూ ‘పొలిటికల్ బాహుబలి’ అంటూ బిరుదు ఇచ్చాడు. 

వాస్తవానికి వర్మ వేసే సెటైర్లలో ఈకామెంట్స్ కూడ ఒక భాగం అని సరిపెట్టుకున్నా పవన్ కళ్యాణ్ కు వచ్చిన తీవ్ర ఓటమి చూసి భవిష్యత్ లో సినిమా సెలెబ్రెటీలు రాజకీయాలలోకి రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనితో పాటు దక్షిణాది సినిమా రంగానికి సంబంధించిన మరో అగ్ర హీరో కలహాసన్ ‘మక్కల్’ పార్టీ కూడ తమినాడులో ఎటువంటి ప్రభావాన్ని చూపించలేక సింగిల్ సీటు కూడ గెలుచుకోలేక పోవడం మరింత సంచలనంగా మారింది. 

ఇక బెంగుళూరు సిటీ నుండి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ తన ఓటమి పై స్పందిస్తూ ‘తన చెంపను తానే కొట్టుకున్నట్లుగా తన ఓటమి మారింది’ అంటూ భావోద్వేగంతో చేసిన ట్విట్ ను బట్టి ఆ ఓటమి ప్రకాష్ రాజ్ ను కలవర పెట్టిందో అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థుతులలో ఈ ఫలితాలను చూసి ఇప్పటికే రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలతో ముందడుగు వెనకడుగు వేస్తున్న రజినీకాంత్ ఇక శాస్వితంగా తన అభిప్రాయాన్ని మార్చుకునే ఆస్కారం కనిపిస్తోంది.  

ఈవిధంగా కొనసాగుతుంటే నిన్న రాత్రి మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయినా తాను రాజకీయాలలోనే కొనసాగుతానని క్లారిటీ ఇస్తూ ప్రజాసమస్యల పై పోరాడుతూ ప్రశ్నిస్తూ ఉంటానని స్పష్టం చేసాడు. అయితే మరో 5 సంవత్సరాల వరకు ఎన్నికలు రాని తరుణంలో అంత కాలం ‘జనసేన’ ను ప్రజల మధ్య నిలబడేట్టుగా చేయడం మాటలు చెప్పినంత తేలిక కాదు..


మరింత సమాచారం తెలుసుకోండి: