ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని సంస్థ వెనుక త్రివిక్రమ్ ఉన్నాడు అన్నది ఓపెన్ సీక్రెట్. అందువల్లనే ఈ సంస్థ ఇప్పటి వరకు పవన్ జూనియర్ అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేయగలిగింది అన్న ప్రచారం ఉంది. అయితే ఈ నిర్మాణ సంస్థ తీసిన సినిమాలలో చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. 

త్రివిక్రమ్ పెట్టిన మొహమాటంతో బన్నీ తన లేటెస్ట్ మూవీని హారికా హాసినీ బ్యానర్ తో చేస్తున్నారు అన్న కామెంట్స్ ఉన్నాయి. వాస్తవానికి ఈసినిమా ప్రాజెక్ట్ నుండి హారిక హాసినీని తప్పించి పూర్తిగా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయాలని బన్నీ ప్రయత్నించినా త్రివిక్రమ్ చేసిన రాయబారాలు వల్ల అల్లు అర్జున్ మెత్తబడి హారికా హాసినీతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అన్న సంకేతాలు ఉన్నాయి. 

అయితే నిర్మాణ వ్యవహారాలు అన్నీ అల్లు అరవింద్ చూసుకుంటాడు అన్న కండిషన్స్ పై ఈ ప్రాజెక్ట్ కు బన్నీ ఒప్పుకున్నట్లు టాక్. వాస్తవ పరిస్థితి వచ్చేసరికి అరవింద్ హారిక హాసినీ నిర్మాతల మధ్య ఏర్పడుతున్న చిన్నచిన్న భేదాభిప్రాయాలు సమస్యగా మారడంతో ఆ సమస్యలను తీర్చే విషయంలోనే ఎక్కువ సమయం త్రివిక్రమ్ కు సరిపోతోంది అంటూ గాసిప్పులు వస్తున్నాయి. 

దీనికితోడు ఈసినిమా సెకండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఫైనల్ గా పూర్తి అయ్యే వరకు ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభించను అని బన్నీ పెట్టిన కండిషన్స్ తో ఈమూవీ సెకండ్ ఆఫ్ స్క్రిప్ట్ ను ఇంకా పూర్తిగా పూర్తి చేయలేక సతమతమవుతున్న త్రివిక్రమ్ ఈమూవీ షూటింగ్ విషయంలో జరుగుతున్న ఆలస్యానికి తెగ మదనపడిపోతున్నట్లు టాక్. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా బన్నీ త్రివిక్రమ్ ల మూవీ పై వస్తున్న గాసిప్పులు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: