టాలీవుడ్ లో టాప్ హీరోగా చలామణి అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించారు.  ఆ సమయంలో ఆయన కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారు..పోటీలో నిలబడలేదు.  మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు.  మూడు నెలలు అలుపెరుగని ప్రచారం చేశారు..చివరి సమయంలో ఆయన వడదెబ్బతో హాస్పిటల్ చేరినప్పటికీ..సెలెన్ పెట్టుకొని మరీ ప్రచారం చేశారు. 

ఆ సమయంలో పవన్ డెడికేషన్ కి అందరూ ఫిదా అయ్యారు.  ఇక ఏపిలో జనసేన ప్రభంజనం భారీ ఎత్తున ఉంటుందని భావించారు.  కానీ నిన్న వెలువడిన ఫలితాల్లో దారుణమైన పరాభవం చవిచూసింది జనసేన.  పవన్ పోటీ చేసిన రెండు చోట్ల అధినేత పవన్ ఓటమి పాలవగా, ఒక్క రాజోలులో మాత్రం పార్టీ అభ్యర్థి గెలవడంతో ఖాతా తెరిచింది. కింగ్ మేకర్‌గా నిలుస్తారనుకున్న పవన్ కూడా ఓటమి పాలవడం జనసేన నేతలను తీవ్ర నిరాశ పరిచింది.

ఎన్నో అంచనాలతో ముందుకు సాగిన పవన్ కి ఏపి ప్రజలు ఇలా ఝలక్ ఇవ్వడంతో షాక్ లో ఉన్నారు జనసేన శ్రేణులు.  కానీ జనసేన కార్యకర్తలు అధినేతకు మేమున్నామంటూ భరోసా ఇచ్చే పనిలో పడ్డారు. ‘విత్ పీకే’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లతో కేడర్‌లోనూ, అధినేతలోనూ ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ‘విత్ పీకే’ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో అడుగు ఎప్పుడూ ఒకటితోనే మొదలవుతుందంటూ రాజోలు గెలుపును ఉదహరిస్తున్నారు. ఇది భవిష్యత్ విజయాలకు నాంది అని సినీ నటుడు నిఖిల్ ట్వీట్ చేశాడు. తాను పవన్‌తోనే ఉన్నానని, మరి మీరెవరితో ఉన్నారంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: