రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదర్శించకుండా చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్న క్రమంలో తాజాగా 2019 ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో తెలుగుదేశం పార్టీ గల్లంతవడం తో రామ్ గోపాల్ వర్మ టైం మొదలైందని ఇటీవల ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక తెలుగుదేశం పార్టీ పై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్స్ చేశారు రాంగోపాల్ వర్మ. తెలుగు దేశం పార్టీ 1982 సంవత్సరం మార్చి నెల 29 వ తేదీ ఆరంభమయిందని , 2019 సంవత్సరం మే నెల 23 వ తేదీ అంతమయిందని , అంతమవడానికి కారణం అబద్ధాలు, వెన్నుపోటు, లంచగొండితనం , అసమర్ధత, నారా లోకేష్ , YS జగన్ అని ట్వీట్ చేశారు.


సుమారు 300 సినిమాలలో నటించిన నందమూరి తారక రామారావు గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ గా పేరుపొందారు. రాజకీయాలలో ప్రవేశించి 1982 సంవత్సరం మార్చి 29 వ తేదీ తెలుగు దేశం పార్టీ స్థాపించారు. తెలుగు వారి ఆత్మ గౌరవం స్లోగన్ తో ప్రజలను ఆకట్టుకున్నారు. 1983 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్య మంత్రి అయ్యారు. మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన ఎన్టీఆర్ పేద ప్రజలకు అండగా అనేక పధకాలు అమలు పరిచి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: