సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నవారు..దాదాపు సినీయర్ హీరోల వారసులే..అయితే కొంతమంది మాత్రం తమ స్వశక్తితో స్టార్ హోదా సంపాదించుకున్నారు.  తెలుగులో చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చినా..ఆయన నటవారసులుగా ఎంతో మంది వస్తున్నారు.  చిరంజీవి తర్వాత రవితేజ, శ్రీకాంత్, నాని లాంటి హీరోలు స్వయంకృషితో పైకి వచ్చారు.  ఇక కన్నడ నాట ప్రస్తుతం చాలా వరకు నటవారసులే రాజ్యమేలుతున్న సమయంలో ఒక సామాన్య బస్ డ్రైవర్ తనయుడు ఇప్పుడు నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు. 

ఆ హీరో ఎవరో మీకర్థమయ్యే ఉంటుంది..ఆ మద్య ‘కేజీఎఫ్’సినిమాతో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దుమ్మురేపిన స్టన్నింగ్ స్టార్ యష్.  చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమకి వచ్చి స్టార్ హీరోగా ఎదగడం అంత తేలికైన విషయం కాదు. అలా ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడాలి .. అవమానాలను ఎదుర్కోవాలి .. అదృష్టం కూడా తోడు కావాలి.  ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ..చిన్నపుడు నేను కాస్త హీరోలా కనిపిస్తే..నా ఫ్రెండ్స్ నువ్వ హీరోలా ఉన్నావ్ రా అనడంతో అప్పటి నుంచి నటనపై నాకు మోజు పెరిగిపోయింది.   

ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉండేది. అందుకే స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేరాను.  ఆ సమయంలో డైరెక్టర్లకు టీ, కాఫీలే కాదు సిగరెట్లు కూడా అందించాను.  నేను అనుకున్న గమ్యం చేరుకోవడానికి ఆ పనులు నాకు పెద్దగా రిస్క అనిపించలేదు..మొత్తానికి అదృష్టం బాగుండి నా ప్రయత్నాలు ఫలించాయి .. ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఇండస్ట్రీలో ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు వుంది. ఇప్పుడు నేను చేయవలసిందల్లా గతంలో కంటే జాగ్రత్తగా ఉంటూ ఈ స్థానాన్ని భవిషత్యత్ లో ఎలా నిలబెట్టుకోవాలన్నదే నా లక్ష్యం అన్నారు యష్. 


మరింత సమాచారం తెలుసుకోండి: