రాజకీయాలలో సినిమాలలో సెంటిమెంట్లు సాధారణం. అయితే మెగా బ్రదర్స్ కు తాము పుట్టి పెరిగిన పశ్చిమ గోదావరి జిల్లాలో వరసగా అన్నదమ్ములందరికీ క్రమం తప్పకుండా ఓటమిలు పరాభవాలు ఎదురౌవడంతో ఈమెగా బ్రదర్స్ కు పశ్చిమం ఏమాత్రం అచ్చిరాదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

2009 ఎన్నికలలో చిరంజీవి తన సొంత ఊరు నరసాపురం పక్కన ఉన్న పాలకొల్లులో పోటీ చేస్తే ఒక మహిళ చేతిలో ఊహించని విధంగా ఓడిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు చాల ఎక్కువగా ఉండే భీమవరంలో పోటీ చేస్తే అక్కడ కూడ ఓడిపోయాడు. ఇక కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ స్థానానికి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తే అక్కడ కూడ ఓటమి మాత్రమే ఎదురైంది. 

సాధారణంగా మెగా ఫ్యామిలీకి ఉన్నస్థాయికి పరపతికి వారి సొంత ఊరు ప్రాంతాలలో విపరీతమైన పట్టు ఉండాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని భావించే నాయకుల పార్టీలు ఓడిపోవచ్చు కాని ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్ధులు ఓడిపోతే వారి పై ప్రజలుకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగా జరిగాయి కానీ కనీసం కొన్నిలో కొన్ని కర్యక్రమాలు కూడ వారు పుట్టిన సొంత ఊరులో జరిగినట్లు కనిపించదు. 

గతంలో చిరంజీవి సొంత ఊరుకు చెందిన కొందరు చిరంజీవిని కలిసి ఒక మంచి లైబ్రరీని అతడి సొంత ఊరిలోని సొంత ఇంటిలో పెట్టమని అడిగితే ఆ చిన్న కోరికను కూడ అప్పట్లో చిరంజీవి తీర్చలేదు అని అంటారు. దీనితో చిరంజీవితో పాటు అతడి సోదరులకు కూడ సొంత ఊరితో అదేవిధంగా సొంత జిల్లాతో అవినాభావ సంబంధాలు బాగా తగ్గిన నేపధ్యంలో కేవలం ప్రతి ఎన్నికకు ఒకొక్కసారి మెగా బ్రదర్స్ లోని ఒక వ్యక్తి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా నుండి పోటీ చేస్తున్న పరిస్థుతులలో వారి అభిమానులు మినహా సాధారణ ఓటర్లలను పెద్దగా నమ్మించ లేకపోవడంతో ఈమెగా బ్రదర్స్ ముగ్గురికి పశ్చిమ గోదావరి జిల్లాలో గత దశాబ్ద కాలం నుంచి ఓటమి ఎదురౌతూనే ఉంది అంటూ కొందరి విశ్లేషకుల అభిప్రాయం..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: